మహారాష్ట్రలోని నాందేడ్ లో సాధువుని హత్య చేసిన ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీసు  విభాగ౦ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర డీజీపీ కూడా స్థానిక అధికారుల నుంచి వివరణ అడిగారు. 

 

సాధు హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై క్రిమినల్ రికార్డ్ కూడా ఉందని అధికారులు వివరించారు. అతను 10 సంవత్సరాల క్రితం దాఖలు చేసిన హత్య కేసులో సహ నిందితుడు మరియు అతడిపై వేధింపుల కేసులు కూడా కేసు నమోదు అయ్యాయని.. నాందేడ్ ఎస్పీ విజయకుమార్ మాగర్ మీడియా కు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: