విశాఖ జిల్లా వెంకటాపురంలో ఈ నెల 7వ తేదీన గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో హైకోర్టు కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది. కంపెనీలోకి ఎవరినీ అనుమతించకూడని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. విశాఖ గ్యాస్ లీకేజీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 
 
హైకోర్టు తీర్పుకు సంబంధించిన తీర్పును ఈరోజు విడుదల చేసింది. న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎవరి అనుమతితో స్టైరీన్ ను తరలించారని.... లాక్ డౌన్ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమాచారంతో అఫడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: