ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విధ్వంసం కొన‌సాగుతూనే ఉంది. ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,92,155కు చేరుకుంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య 3,46, 366కు చేరుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అమెరికాలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే.. కొద్దిరోజులుగా ఇక్క‌డ ప‌రిస్థితి కొంత అదుపులోనే ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంటోంది. అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 16,85,318 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొత్త‌గా 18,490 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మ‌ర‌ణాల సంఖ్య 99,286కు చేరుకుంది.

 

ఆ త‌ర్వాత బ్రెజిల్ దేశంలో క‌రోనా రెచ్చిపోతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 3,63,211కు చేరుకుంది. కొత్త‌గా 15,813కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 22,666మంది మృతి చెందారు. రష్యాలో 3,44 481 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొత్త‌గా 8,599 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 3,541మంది మ‌ర‌ణించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: