తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈద్‌- ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి రంజాన్‌ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పర్వదినం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, మత సహనాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. తెలంగాణలో గంగా-జమున తెహజీబ్‌కు అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. 

 

ఖురాన్‌ బోధనలు సమాజ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయని గరర్నర్‌ తమిళిసై చెప్పారు. క్రమశిక్షణతో జీవించేందుకు పవిత్రరంజాన్‌ మాస ఉపవాస దీక్షలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనే స్థెర్యాన్ని రంజాన్‌ పర్వదినం అందిస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: