ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏడు వస్తువులను విద్యార్థులు పాఠశాలకు వచ్చిన తొలి రోజే అందించనున్నారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు 3 జతల దుస్తుల వస్త్రం, బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, స్కూల్‌ బ్యాగ్‌ లను కిట్ రూపంలో అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. 
 
ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని ఉచితంగా అందించనుంది. దుస్తుల వస్త్రాన్ని పాఠశాలల పేరెంట్స్‌ కమిటీల ద్వారా ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ఈ పథకం కోసం రూ. 650.60 కోట్లను ఖర్చు చేస్తోంది. సీఎం జగన్ వస్తువుల నాణ్యతలో ఏమాత్రం రాజీ వద్దని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: