ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మెక్సికో, చిలీ, పెరూ, అమెరికాలలో విజృంభిస్తోన్న కరోనా బ్రెజిల్ ను గజగజా వణికిస్తోంది. ఇప్పటివరకు బ్రెజిల్ లో 3,52,000 కేసులు నమోదు కాగా 22,000 మంది మృతి చెందారు. 
 
ఒక్కరోజే అక్కడ 16,000 కరోనా కేసులు నమోదవుతున్నాయి. లాటిన్‌ అమెరికా కరోనాకు కొత్త హాట్‌స్పాట్‌గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలు చేసిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 26వ తేదీన తొలి కేసు నమోదు కాగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కట్టడి విషయంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో విఫలమయ్యారని ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: