ఆంఫ‌న్ తుఫాన్ కోల్‌క‌తా న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసింది. ప‌చ్చ‌ని చెట్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడే న‌గ‌రం ఇప్పుడు మోడువారిబోతోంది. ఈ త‌ఫాన్ ధాటికి ఏకంగా కోల్‌క‌తా న‌గ‌రంలోనే 5వేల‌కుపైగా చెట్లు కూలిపోయిన‌ట్లు మున్సిప‌ల్ అధికారులు చెబుతున్నారు. కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతం 72 మునిసిపాలిటీలు, 527 పట్టణాలు గ్రామాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో అయితే.. దాదాపుగా 10,000పైగా చెట్లు కూలిపోయి ఉంటాయ‌ని పర్యావరణవేత్త గ్రీన్ టెక్నాలజీ, సోమేంద్ర మోహన్ ఘోష్ చెబుతున్నారు.

 

ఈ సంద‌ర్భంగా ప‌ర్యావర‌ణవేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కూలిపోయిన ఒక చెట్టు స్థానంలో ప‌ది మొక్క‌ల‌ను నాటితేనే ఆ న‌ష్టాన్ని పూడ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ఇలా చూస్తే ల‌క్ష‌కుపైగా మొక్క‌లు అవ‌స‌రం అవుతాయ‌ని అంటున్నారు. అంతేగాకుండా.. వేల సంఖ్య‌లో చెట్లు కూలిపోవ‌డంతో న‌గ‌ర ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. న‌గ‌రంలో కాలుష్యం విప‌రీతంగా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: