ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఈరోజు సంక్షేమంపై సదస్సు నిర్వహించడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడారు. వివక్ష లేకుండా రాష్ట్రంలో పథకాలు అమలు చేయాలని భావించామని తెలిపారు. ప్రభుత్వ సేవలను ఇంటి దగ్గరకు చేరే విషయంలో సక్సెస్ అయ్యామని తెలిపారు. 14 నెలల పాటు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చూశానని తెలిపారు. 

 

ప్రభుత్వ పథకాలు గడప దగ్గరకే చేర్చడం చారిత్రాత్మకం అని సీఎం అన్నారు. వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే మాత్రమే ప్రజలను ఆదుకోగలమనే లక్ష్యంతో పని చేశామని తెలిపారు. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజననం చేకూరేలా పథకాల అమలు చేస్తున్నామని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: