ఏపీలో విద్యావ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని, అన్నివ‌ర్గాల పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని ముఖ్య‌మంత్ర జ‌గ‌న్ అన్నారు. ఈరోజు చేప‌ట్టిన‌ *మ‌న పాల‌న‌-మీ సూచ‌న‌* కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. విద్యారంగంలో విప్లవాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నామ‌ని అన్నారు. విద్యాదీవెన ప‌థ‌కం చేప‌ట్టి.. రూ.4వేల కోట్ల ఫీజురియింబ‌ర్స్‌మెంట్ అందించామ‌ని అన్నారు.

 

అలాగే... బ‌డికి వెళ్తున్న 45ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన పుస్తకాలు, షూస్‌, బ్యాగులు.. ఇలా ప్ర‌తీ ఒక్క‌టి అందించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అన్నారు. విదేశాల్లో చ‌దివేవారికోసం ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించి చేయూత అందిస్తున్నామ‌ని అన్నారు. ఇలా.. విద్యారంగంలో స‌మూల‌మార్పులు తీసుకొస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: