ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన - మీ సూచన పేరుతో ఈరోజు సంక్షేమంపై సదస్సు నిర్వహిస్తూ లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుందని తెలిపారు. జులై 8వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ పథకం అమలవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 1,060 ఆంబులెన్స్ లు రోడ్డెక్కనున్నాయని తెలిపారు. 
 
1,06,000 మంది ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. నాడు - నేడుతో స్కూళ్ల భవిష్యత్తును మార్చనున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో విప్లవాన్ని తీసుకొచ్చామని తెలిపారు. 3.57 కోట్ల మందికి 40,137 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని తెలిపారు. పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: