దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇక లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సామాన్యుల కష్టాలు చెప్పనలవి కాదు.  చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక మాంసం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది చికెన్.  తక్కువ ధరలో ఇంటిల్లిపాది తెచ్చుకొని తృప్తిగా చికెన్ కూర వండుకొని తినేవాళ్లు.. కానీ ఇప్పుడు చికెన్ పేరు చెబితే భయపడిపోయే పరిస్థితి వచ్చింది.  కరోనా వచ్చిన కొత్తలో చికెన్ రేటు దారుణంగా రూ.25 లకు పడిపోయింది. కానీ ఈ మద్య ఒక్కసారే రూ.300 దాటిపోయింది.  రెండు వారాల‌కి  ముందు హైద‌రాబాద్‌లో బోన్ లెన్ చికెన్ ధ‌ర కిలో రూ. 400 ఉండ‌గా, ఈ ఆదివారం ఏకంగా రూ.500కి చేరుకుంది. దీంతో మాంసం ప్రియులు గ‌గ్గోలు పెడుతున్నారు. 

 

ప్ర‌స్తుతం పౌల్ట్రీ ప్రొడ‌క్ష‌న్ త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో చికెన్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండా కాలం వ‌ల‌న ఉత్ప‌త్తి పెద్ద‌గా ఉండ‌డం లేదు. హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ కూడా మూత ప‌డ‌డంతో చికెన్ సేల్స్ 60 శాతం ప‌డిపోయాయి.  ఈ నేప‌థ్యంలో సప్లై పెద్ద‌గా ఉండ‌డం లేదు. వ‌చ్చే నెలలో వ్యాపారం సాధార‌ణ స్థితికి వ‌స్తుంద‌ని భావిస్తున్నాం. ఆ త‌ర్వాత  ప్ర‌తి రోజు రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల కోళ్లు స‌ర‌ఫ‌రాచేస్తాం అంటున్నారు.   

 

ప్ర‌స్తుతానికి  4ల‌క్ష‌లు మాత్ర‌మే స‌ర‌ఫరా చేస్తున్నాం అని స్నేహ ఫార్మ్ చైర్మ‌న్ రామ్ రెడ్డి పేర్కొన్నారు.  ఇక మటన్ ఆ మద్య రూ.1000 కి అమ్మారు.. కానీ జీహెచ్ఎంసీలో  మటన్ అధిక ధరలకు  అమ్ముతున్న దుకాణాలపై దాడులు ప్రారంభించిన కిలో సుమారు రూ.700 రూపాయలకు అమ్ముడవుతోంది. మొత్తానికి  లాక్‌డౌన్ ఎఫెక్ట్‌, స‌మ్మ‌ర్ ఈ  రెండు మాంసాహార ప్రియులు నిరాశ‌కి గుర‌వుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: