దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 635 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 14,053కు చేరింది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటి. 
 
కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 20 శాతం బెడ్లను కరోనా రోగులకు కేటాయిస్తూ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ నగరంలోని 117 ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 20 శాతం బెడ్లు పూర్తిగా కరోనా రోగుల కోసం మాత్రమే కేటాయిస్తున్నామని కీలక ప్రకటన చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక కుటుంబం కరోనా రోగి కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్ కోరగా ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించిందని అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: