ఢిల్లీ క్రైంబ్రాంచ్ తబ్లీగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కు భారీ షాక్ ఇచ్చింది. మౌలనా సాద్ తో పాటు అతని సన్నిహితులుగా భావిస్తున్న ఐదుగురి పాస్ పోర్టులు సీజ్ చేసింది. ముఫ్తి షాజాద్‌, జిషాన్‌, ముర్సాలిన్‌ సైఫీ, మహ్మద్‌ సల్మాన్‌, యూనస్‌ల చుట్టూ ఉచ్చు బిగించింది. నిబంధనలకు విరుద్ధంగా తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైన 916 మంది విదేశీయులపై కూడా త్వరలో ఛార్జ్ షీట్ వేసేందుకు రంగం సిద్ధమైంది. టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించడంతో వీరిపై ఛార్జి షీటు దాఖలు కానుంది. 
 
67 దేశాల నుంచి వచ్చిన విదేశీయుల వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం వల్ల దేశంలో అనేక ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్‌ మౌలానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు వచ్చినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలడంతో ఈడీ మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: