ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో తాజాగా మరో కుంభకోణం వెలుగు చూసింది. కొంతమంది అక్రమార్కులు భక్తుల సొమ్మును కాజేశారు. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. 3.30 కోట్ల మేర నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. 150 రూపాయల శ్రీఘ్రదర్శనంలో కోటి రూపాయలను, 1500 అభిషేకం టికెట్లలో 50 లక్షలను, అకామడేషన్‌లో మరో 50 లక్షలను సాఫ్ట్ వేర్ ను మార్చే అక్రమార్కులు కాజేసినట్టు సమాచారం. 
 
ఈవోకు ఫిర్యాదులు రావడంతో ఉద్యోగులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండటం గమనార్హం. అక్రమార్కులు అభియోగాలు తమపైకి రాకుండా టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారని తెలుస్తోంది. ఆలయ ఈవో రామారావు భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమే అని చెప్పారు. మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రావాలని... ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పిస్తున్నామని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: