గత కొన్ని రోజుల నుంచి టీటీడీ ఆస్తుల వేలం గురించి భారీగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 1974 నుంచి 2014 వరకు 100కు పైగా ఆస్తులు అమ్మారని తెలిపారు. రెండు రోజులుగా వస్తున్న వార్తలు బాధాకరమని అన్నారు. సదావర్తి, దుర్గమ్మ భూములు ప్రతిపక్షంలో ఉండి కాపాడామని తెలిపారు. రాజకీయ వ్యతిరేకతతోనే నిందలు వేస్తున్నారని అన్నారు. 50 ఆస్తులు వేలం వేయాలని 2016లో తీర్మానం చేశారని తెలిపారు. 
 
ఆ భూములు చాలా దూరంగా ఉండటంతో... తక్కువ స్థలం మాత్రమే ఉండటంతో ఆస్తులు వేలం వేస్తున్నామని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, కాంచీపురం, తిరుత్తణి గ్రామాల్లో సెంట్లలో భూములు ఉన్నాయని వ్యవసాయ భూములు ఎకరా, రెండెకరాల భూములు ఉన్నాయని... ఆ భూములను కాపాడటం టీటీడీకి సాధ్యం కాదని అన్నారు. కానుకగా ఇచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై కమిటీలు నియమించి ముందుకెళుతున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: