దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. లక్షా 50 వేల దిశగా అడుగులు వేస్తున్నాయి కరోనా కేసులు. ఇదే స్పీడ్ తో వెళ్తే మాత్రం మరో రెండు రోజుల్లో కరోనా కేసులు ఆ మార్క్ ని దాటే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ శాఖల్లో కూడా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

తాజాగా రైల్వే శాఖలో కరోనా కేసులు బయటపడ్డాయి. రైల్వే బోర్డులోని కొందరు అధికారులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఇంటెన్సివ్ శానిటైజేషన్ కోసం మే 26 & 27 తేదీల్లో రైల్ భవన్ యొక్క అన్ని కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించారు. పూర్తి శానిటేషన్ చేయడానికి గానూ వాటిని మూసి వేసి తర్వాత ఓపెన్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: