ఆంధ్రప్రదేశ్ లో గత రెండు మూడు రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న వ్యవహారం టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారం. అసలు ఎవరిని అడిగి అమ్ముతున్నారు ప్రభుత్వం ఆయితే ఏది అయినా చేస్తుందా అంటూ పలువురు నిలదీస్తున్నారు. అయితే అమ్మవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

 

ఈ నేపధ్యంలోనే దీనిపై వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. టీటీడీ ఆస్తులు అమ్మాలన్న నిర్ణయం జరగలేదని వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలన్న చర్చ మాత్రమే జరిగిందని ఆయన వివరించారు. సత్రాల్లో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు మానవతా దృక్పథంతో చూడాలని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా తిరుమలలో అన్యమత ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేసారు. కాగా సంప్రదింపుల తర్వాతే ఆస్తుల అమ్మకం జరపాలని ప్రభుత్వం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: