రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో రోళ్ళు ఎక్కడ పగులుతాయో అనే విధంగా ఎండలు ఉన్నాయి. రోహిణి కార్తికి ముందే ఎండలు చుక్కలు చూపించగా ఇప్పుడు అవి మరింత తీవ్రంగా ఉన్నాయి. సోమవారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించి ఎండలు నమోదు అయ్యాయి. 

 

నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 46.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో గరిష్టంగా 42.3 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కొత్త గూడెం లో సోమవారం 46 డిగ్రీలు... ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం గరిష్టంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం దానికి తోడు... వడ గాల్పులు మరింత తీవ్రంగా ఉండటం తో ప్రజలు బయటకు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: