ప్రపంచంలో అమ్మ ప్రేమ తర్వాత తోబుట్టువల ప్రేమ ఎంతో గొప్పదని అంటారు.  ఇంటి కి ఒక్క ఆడపిల్ల ఉండాలని అంటారు.. మెట్టినింటికి వెళ్లినా పుట్టినింటి ప్రేమను ఎప్పటికీ మరువరు ఆడపిల్లలు.  అందుకే తల్లి తర్వాత అక్కచెల్లెల్ల ప్రేమ ఎంతో గొప్పదని అంటారు. మన దేశంలో రాఖీ పౌర్ణమి వేడుక ఎంత గొప్పగా చేసుకుంటారో అందరికీ తెలిసిందే.  తాజాగా ఓ దివ్యాంగురాలైన చిన్నారి బాస్కెట్ బాల్ ఆడాలనిపించింది.. అయితే అంత ఎత్తున బాల్ వేయడం ఎంత కష్టమో తెలిసిందే.  అంతే ఆమె సోదరుడు బాల్ తన సోదరికి ఇచ్చి బాస్కెట్ గోల్ ని తన అక్కవద్దకు వంచి ఆమె అందులో బాల్ వేసేలా చేశాడు.. అంతే ఆ బాలిక సంతోసానికి అవథులు లేకుండా పోయాయి.

 

అంతేకాదు తన సోదరి బాల్ వేయడం చూసి తర్వాత చప్పట్లు కొడుతూ ఆ చిన్నారిని ఎంతో ఎంకరేజ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. నిజంగా ఇది కదా అసలైన ప్రేమఅంటే.. ఇలాంటి సంఘటనలు ఎంతో అపురూపం అనిపిస్తుందని, ఆ లిటిల్ ఎంజెల్ కోసం ఆ చిన్నారి చేసిన పని ఎప్పుడూ గుర్తుండిపోతుందని.. సోదరి ప్రేమ కోసం సోదరులు ఎప్పుడూ ముందు ఉంటారంటూ నటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: