దేశంలో లాక్ డౌన్ అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి ఆరోపణలు చేసారు. కాసేపటి క్రితం లైవ్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. లాక్ డౌన్ ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నామని ఆయన అన్నారు. కేసులు పెరుగుతుంటే సడలింపు లు ఇచ్చిన రాష్ట్రం భారత్ అని ఆయన ఆరోపించారు. దేశం లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని రాహుల్ అన్నారు. 

 

లాక్ డౌన్ ఉద్దేశం లక్ష్యం నెరవేరలేదని రాహుల్ ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. లాక్ డౌన్ ఎగ్జిట్ లో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని అన్నారు. ఒక పక్క కేసులు ఈ స్థాయిలో  ఉన్నా సరే ఒక ప్లానింగ్ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: