వ్యవసాయ అనుబంధ రంగాలపై సిఎం వైఎస్ జగన్ మేధోమధనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి 24 మంది రైతులు హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ఏడాది కాలంలో అమలు చేసిన సంస్కరణలపై జగన్ సమీక్ష నిర్వహించారు. సున్నా వడ్డీ తో పంట రుణాలు  ఇచ్చామని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రైతులతో  ఆయన స్వయంగా మాట్లాడారు. 

 

రైతులు రైతు కూలీలు బాగుంటేనే దేశం బాగుంటుందని జగన్ పేర్కొన్నారు. పంట సాగు ఖర్చు తగ్గిస్తే రైతులు బాగు పడతారని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రైతులకు ఏ కష్టం వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు. నాలుగేళ్ళకు బదులు 5 ఏళ్ళకు రైతు భరోసా అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: