ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మరో శుభవార్త చెప్పారు. రైతుల ఖాతాలలో అక్టోబర్ నెలలో 4000 రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా జమ చేస్తామని అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే రైతుల కోసం 10,290 కోట్లు ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన ఎనిమిది వేల కోటల రూపాయలు పస్తుత ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. క‌రెంటు కోసం గ‌త ప్ర‌భుత్వం ఎగ్గొట్టిన విద్యుత్ బిల్లుల అమౌంట్‌ మొత్తం చెల్లించామని అన్నారు. 
 
1700 కోట్ల రూపాయలతో ఫీడర్లను సమకూరుస్తున్నామని అననరు. మే నెలలో రైతులకు 7,500 రూపాయలు జమ చేశామని అన్నారు. ఖరీఫ్ లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా కల్పించనుందని తెలిపారు. ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పించనున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: