ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఫామాయిల్ రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఫామాయిల్ రేటు 500 రూపాయలు తక్కువగా ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య రేటులో వ్యత్యాసం ఉందని... ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఫామాయిల్ రైతుల కోసం ఇప్పటికే 80 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని తెలిపారు. భవిష్యత్తులో మరింతగా రేట్లు పెంచి ఫామాయిల్ ను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. 
 
రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో రైతు భరోసా కేంద్రాల ద్వారా సలహాలు, సూచనలు అందజేస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాలే కొనుగోలు చేస్తాయని తెలిపారు. నాణ్యత కోసం 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: