ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 80,522 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్లలో విక్రయించామని... కరోనా సమయంలో రైతులు నష్టపోకుండా 1100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంటలు కొనుగోలు చేశామని తెలిపారు. మొక్కజొన్న, టమాట, అరటి పంటలను కొనుగోలు చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. వారం రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించామని... 8 నెలల కాలంలో 5 లక్షల 60 వేల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశామని తెలిపారు. 
 
ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.2,200 కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. రూ.12,672 కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. గతప్రభుత్వం సున్నావడ్డీ పథకాన్ని పట్టించుకోలేదని... రైతులకు వైయస్సార్ సున్నావడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని... ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకు రూ.49,000 లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 
 
రైతులకు ఉచిత కరెంట్ వల్ల ప్రతి ఏడాది రాష్ట్రప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం పడుతోందని... కరెంట్‌ ఇచ్చేందుకు రూ.1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించామని అన్నారు. 82 శాతం ఫీడర్లలో 9 గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుందని.... మిగిలిన 18 శాతం ఫీడర్లలో రబీ నాటికి 9 గంటల ఉచిత విద్యుత్ మొదలవుతుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: