రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నామని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. రూ.1270 కోట్లు బీమా ప్రీమియం కూడా చెల్లించామని అన్నారు. పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు సహాయం అందాలన్నారు ఆయన. గత ప్రభుత్వం సున్నావడ్డీ పథకాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పుకొచ్చారు.

 

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని అన్నారు. ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకు రూ.49వేలు లబ్ధి చేకూరుతోందని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది రాష్ట్రప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం పడుతుందన్నారు. పగటిపూట కరెంట్‌ ఇచ్చేందుకు రూ.1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించామన్నారు. ఈ ఖరీఫ్‌ నాటికి 82శాతం ఫీడర్లలో 9గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుందని జగన్ వివరించారు. మిగిలిన 18శాతం రబీనాటికి అందుబాటులోకి వస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: