మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రైతు వేదిక భవన శంకుస్థాపనకు హాజరై  ప్రసంగంలో మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా విజృంభణతో గందరగోళం నెలకొందని అన్నారు. కరోనా విజృంభణలో పరిశ్రమలు, అన్ని రంగాలు ఆర్థికంగా దెబ్బ తిన్నాయని తెలిపారు. ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తామని తెలిపారు. లాక్ డౌన్ టైమ్ లోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. రెండున్నర లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. 
 
గోదావరి నీళ్లను తీసుకొచ్చి రైతుల కాళ్లను కడుగుతున్నామని అన్నారు. రైతులను రాజు చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లాను పచ్చదనంతో కలకలలాడాలనే చేస్తున్నామని అన్నారు. పోతిరెడ్డిపాడు తవ్విందే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంటు కూడా సరిగ్గా అందలేదని అన్నారు. కాలంతో పొటీ పడి కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లు అందేలా చేస్తామని అన్నామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: