ఈ మద్య  కరోనా వైరస్ ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా క్రేమ్ రేటింగ్ తగ్గిందని అంటున్నారు. కాకపోతే అక్కడక్కడ అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్‌లోనే ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇది చోటు చేసుకుంది. వన్యప్రాణుల వేట కేసులో అరెస్టైన శ్రీలం రంగయ్య బాత్రూం గదిలో ఉరి వేసుకున్నాడు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా.? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ వేగవంతం చేశారు.

 

 రామగిరి మండలం రామయ్య పల్లి గ్రామానికి చెందిన రంగయ్య ఇటీవల వన్య ప్రాణులను వేటాడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అలర్ట్ అయి అతనితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.  విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  ఇంతలోనే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. శిక్షపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: