ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను అమ్మాలని బోర్డ్ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో దీనిపై రెండు రోజులుగా తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ కి బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి అండగా నిలిచారు. ఉత్తరాఖండ్ లో చార్ ధాం లతో కలిపి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని దేవాలయాలకు తనను తాను చైర్మన్ గా ప్రకటించుకున్నారని ముందు దీనిపై స్పందించాలని ఆయన కోరారు. 

 

ఇదేనా హిందువాదం అని ఆయన ప్రశ్నించారు. కాగా టీటీడీ ఆస్తులను అమ్మడానికి వీలు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 53 చోట్ల ఉన్న ఆస్తులను అమ్మడానికి వీలు లేదని వాటి వినియోగం మీద దృష్టి పెట్టాలని సూచనలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: