ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గంట గంటకు కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. 56 లక్షలకు చేరువలో ఉన్నాయి కరోనా కేసులు. ఇక మరణాల సంఖ్య కూడా 3 లక్షలు దాటింది. ఇక మన దేశం విషయానికి వస్తే కరోనా మరణాలు తక్కువగానే ఉన్నా కేసులు మాత్రం భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. 

 

అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా మరణాలు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 6.45 శాతం మంది కరోనా తో ప్రాణాలు కోల్పోతుంటే మన దేశంలో ఈ సంఖ్య 2.87% కంటే తక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: