టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియని ఆపేయాలి అని.... బిజెపి నేతలు డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. టీటీడీ ఆస్తుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి గాని ట్రస్ట్ లకు గాని హక్కులు లేవు అని స్పష్టం చేసారు. హక్కు లేదని ఈ మేరకు చట్టం తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేసారు. 

 

గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇంకా అమలులో ఉందని ఆయన అన్నారు. దీనిపై ధర్మ పరిరక్షణ యాత్ర చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హెచ్చరించారు. ఆస్తులను నిర్వహించలేనప్పుడు భక్తుల నుంచి తీసుకోవద్దు అని ఆయన స్పష్టం చేసారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: