ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ సమయంలో అక్రమ మద్యం బయటపడుతూనే ఉంది. తెలంగాణా జిల్లాల నుంచి భారీగా ఏపీలోకి మద్యం తరలిస్తున్నారు కొందరు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. దీనితో మద్యం అక్రమ రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇక గుంటూరు కృష్ణా సహా కొన్ని జిల్లాల్లో ఈ మద్యం అక్రమ రవాణా ఉంది. 

 

తాజాగా గుంటూరు జిల్లాలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి మండలం, పెదగార్లపాడు చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్ల పొదల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 1500  మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు... వాటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేసారు. ఇద్దరినీ అదుపులోకి కూడా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: