ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సినిమా షూటింగ్ లకు తెలంగాణా సర్కార్ అనుమతి ఇచ్చే అవకాశాలు కనపడటం లేదు. ముందు జూన్ నుంచి ఇవ్వాలని తెలంగాణా సర్కార్ భావించినా సరే ఇప్పుడు కేసులు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి కాబట్టి లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యడమే మంచిది అని సూచనలు చేస్తున్నారు. 

 

ఇక తెలంగాణా ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో ఉంది. ఒకవేళ సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా వారానికి మూడు రోజులు మాత్రమే ఇవ్వాలని ఎక్కువ మంది కార్మికులు లేకుండా పరిమిత సంఖ్యలో షూటింగ్ చేసుకోవాలని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి. కాగా ఇటీవల సినీ పెద్దలు కేసీఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: