ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో వాటి ఉత్పత్తిని పెంచడమే కాకుండా అతక్కువ ఖరీదు ఉన్న వెంటిలేటర్లను తయారు చేయడానికి శ్రీకారం చుట్టారు. అమెరికాలో నివాసం ఉండే ఒక భారత సంతతికి చెందిన జంట తక్కువ ఖర్చుతో అత్యవసర పోర్టబుల్ వెంటిలేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

 

ఈ లోకాస్ట్ వెంటిలేట‌ర్ ఉత్ప‌త్తిని త్వరలోనే అమెరికాలో ప్రారంభిస్తారు. అమెరికాతో పాటు ఇండియాలో కూడా ఈ వెంటిలేట‌ర్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. త‌క్కువ ఖ‌ర్చుతో  కరోనా బాధితులకు చికిత్స అందించ‌డానికి గానూ ఈ వెంటిలేటర్ ఉపయోగపడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా వీటిని అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి కొన్ని దేశాల్లో రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: