దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో వరుసగా ఐదో రోజూ ఆరు వేల మంది కరోనా భారీన పడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,45,380కు చేరింది. ప్రతిరోజూ 3,000 కు పైగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర రాష్ట్రంలో తాజాగా 2,436 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలొ 400 - 800 మధ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దేశంలో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉంది. భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ప్రాథమిక స్థాయిలో కరోనా కేసులను గుర్తించడం వల్లే మరణాల రేటు తక్కువగా ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం రికవరికీ రేటు 41 శాతం దాటిందని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: