తెలంగాణాలో నేటి నుంచి పసుపు కొనుగోళ్ళు చేయనుంది తెలంగాణా ప్రభుత్వం. దీనిపై నిన్న తెలంగాణా సర్కార్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి నిజామాబాద్ మార్కెట్ లో పసుపుని కొనుగోలు చేస్తామని చెప్తూ కొన్ని మార్గదర్శకాలను కూడా తెలంగాణా సర్కార్ విడుదల చేసింది. 

 

నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు కొనుగోళ్ళు చేపడతారు. ఇక పది వేల బస్తాలను మాత్రమే నేటి నుంచి కొనుగోలు చేస్తారు అధికారులు. కేవలం తెలంగాణాలో  పండిన పసుపుని మాత్రమే కొనుగోలు చేస్తామని తెలంగాణా సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో రైతులు పెద్ద ఎత్తున పసుపు తీసుకుని వెళ్తున్నారు. ఇక మాస్క్ లు సామాజిక దూరం అనేది తప్పనిసరి కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: