కర్ణాటక లో రాజ్యసభ సీట్ల వ్యవహారం కొలిక్కి వచ్చింది. విపక్షాలు జెడిఎస్ కాంగ్రెస్ రెండు రాజ్యసభ సీట్ల మధ్య  ఒప్పందానికి వచ్చేసాయి. మాజీ ప్రధాని దేవే గౌడను, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే ని రాజ్యసభకు పంపించాలని జెడిఎస్ కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చాయి. 

 

కాగా రాజ్యసభ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నామినేషన్లు కూడా పూర్తి అయ్యే దశలో కరోనా రావడంతో రాజ్యసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలో రాజ్యసభ స్థానాలకు  అధికార పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసాయి. తెలంగాణా నుంచి ఇద్దరు రాజ్యసభకు ఏపీ నుంచి కొత్తగా నలుగు రాజ్యసభకు వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: