దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి చేయడానికి మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న దరిమిల ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక చర్యలకు సిద్దమయ్యారు.  అంతలోనే లాక్ డౌన్ రావడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  అయితే తెలంగాణలో లాక్ డౌన్ లో ఈ మద్య కొన్ని సడలింపులు తీసుకువచ్చారు. రాత్రి మాత్రం కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు.  ఈ వారం రోజుల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది.

 

కరోనా కట్టడి, వానాకాలం పంటలు, లాక్ డౌన్ సడలింపులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. రోహిణి కార్తె ప్రారంభమైన నేపథ్యంలో.. వానాకాలం పంటలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సీజన్లో గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా? లేదా? విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అనే విషయాలపై కీలకంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే దానిపై కూడా సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. అదేవిధంగా కరొనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలుపై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: