తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా నుంచి కోలుకుని రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.  ఆ మద్య గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కొత్త రికార్డు నెలకొల్పారు. స్వైన్‌ఫ్లూ సోకిన గర్భిణికి విజయవంతంగా కాన్పు చేశారు.  వెంటిలేటర్‌పై ఉన్న సదరు మహిళకు స్వైన్‌ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు.  తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం చేశారు.  స్థానికంగా ఓ కార్పరేట్‌ ఆస్పత్రిలో ప్రసవం కోసం సంప్రదిస్తే రూ.25 లక్షలు ఫీజు చెల్లించమన్నారని.. గాంధీ వైద్యులు ఉచితంగా చేశారని సదరు మహిళ కుటుంబసభ్యులు చెప్పారు. తల్లీబిడ్డా ఇద్దరినీ వైద్యులు డిశ్చార్జి చేశారు.

 

ఆ తర్వాత కరోనా పేషెంట్ కి ప్రసవం చేసి తల్లీ బిడ్డలను కాపాడిన విషయం తెలిసిందే. తాజాగా  20 ఏండ్ల ఆ మహిళకు మంగళవారం కవలలు పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం డెలివరీ కోసం ఆమె నీలోఫర్ హాస్పిటల్‌‌లో చేరారు. మేడ్చల్‌‌లో ఆమె ఉంటున్న ఏరియా కంటైన్‌‌మెంట్ జోన్ కావడంతో, లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయించారు. పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించారు. అసోసియేట్ ప్రొఫెసర్‌ రేణుక నేతృత్వంలోని డాక్టర్ల బృందం  మంగళవారం ఆమెకు సిజేరియన్ చేశారు. పిల్లలిద్దరికీ టెస్టులు చేయిస్తున్నామన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: