ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇక ఏడాది పాలన సందర్భంగా విద్యాశాఖ పై సిఎం వైఎస్ జగన్ మేధోమధనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్ధులకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1 నుంచి ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మ ఒడి  పథకం అందిస్తామని జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. 

 

విద్యారంగంలో తాము ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని చాలా  మంది పదో తరగతితో నే డబ్బులు లేక చదువులు ఆపెస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే మన దేశంలో విద్యార్ధులు కాలేజి వరకు వెళ్ళే సంఖ్య చాలా తక్కువ అని జగన్ పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం ని తీసుకుని రావడానికి సుప్రీం కోర్ట్ కి వెళ్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: