ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా మేధోమథన సదస్సులను మన పాలన మీ సూచన పేరుతో నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ఈరోజు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆగష్టు నెల 3వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సంవత్సరం అందించిన విధంగానే వచ్చే సంవత్సరం జనవరి 9వ తేదీన అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తానని చెప్పారు. 
 
అమ్మఒడి పథకానికి ఈ సంవత్సరంలో హాజరుతో సంబంధం లేకుండా 15,000 రూపాయలు నగదు జమ చేశామని ఈ సంవత్సరం మాత్రం 75 శాతం హాజరు ఉండాలని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అందేలా మెనూను రూపొందించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: