ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా ఈరోజు లబ్ధిదారులతో మాట్లాడారు. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. కోర్సుల్లో ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేస్తామని అన్నారు పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ కోసం ఇద్దరు రిటైర్డ్ జడ్లీలను నియమించామని అన్నారు. పాఠశాలలు, కాలేజీలు కల్పించే సదుపాయాలను వెబ్ సైట్ లో ఉంచాలని చెప్పారు. 
 
పాఠశాలలు, కాలేజీలు వెబ్ సైట్ లో పెట్టిన సదుపాయాలు లేని పక్షంలో వాటిని సీజ్ చేసే అధికారం ఉందని అన్నారు. ఒక తల్లి జగన్ తో మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని... అమ్మఒడి పథకం డబ్బులు జమయ్యాయని చెప్పారు. తాను పాఠశాలలో వంట పని చేస్తున్నానని మెనూలో మార్పులు చేయడం వల్ల పిల్లలు ఎంతో బాగా తింటున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: