జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో కరోనా కరల నృత్యం చేస్తోంది. ఈ రాష్ట్రంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయ్. గడచినా 24 గంటల్లో 91 కేసులు నమోదు అయ్యి అందరిని షాక్ కి గురిచేసిరి. జమ్మూ డివిజన్ లో 54 కేసులు , కాశ్మీర్ డివిజన్ లో 37 కేసులు నమోదు అయ్యాయి. అయితే జమ్మూకాశ్మీర్ లో ఇప్పటివరకు 1759 కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటలలో 91 కేసులు నమోదు కాగా అందులో నలుగురు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమించడంతో నిన్న చనిపోయారు. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర వైద్య అధికారులు వెల్లడించారు. 

జమ్మూ ప్రాంతంలో లో రాంబాన్‌లో 29 మందికి, జమ్మూ జిల్లాలో 10 మందికి, ఫూంచ్ ,‌కతువా  జిల్లాలో నలుగురు చొప్పున, సాంబా, ఉధంపూర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, రేసిలో ముగ్గురికి కరోనా సోకింది.

కశ్మీర్‌ ప్రాంతం‌లోని బుద్గాంలో 12 మందికి, శ్రీనగర్‌లో ఏడుగురికి, బారాముల్లాలో ఆరుగురికి, బందీపోరా, గందేర్బాల్‌లో నలుగురికి చొప్పున, పుల్వామాలో ఇద్దరికి,  కుప్వారా , కుల్గాం లో ఒక్కరికి చొప్పున కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: