అధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ పొడిగింపు, లాక్ డౌన్ సడలింపులు, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల గురించి ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో గత వారం రోజుల్లో 400 కరోనా కేసులు నమోదు కాగా 23 మంది మృతి చెందారు. సీఎం కేసీఆర్ కొత్త కేసులు నమోదు కాకుండా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు సూచనలపై కూడా చర్చ జరగనుందని సమాచారం అందుతోంది. కేసులు పెరిగితే ఆ ఏరియాను మూసేయడమే పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ లో సరి బేసి విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా పరీక్షల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: