దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆలయాలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రముఖ దేవాలయాలు సహా చిన్న చిన్న దేవాలయాలు అన్నీ కూడా మార్చ్ 22 తర్వాత మూసి వేసిన సంగతి తెలిసిందే. వైన్ షాపులు సహా అనేకం అనుమతులు ఇచ్చినా సరే ఇప్పుడు దేవాలయాలకు మాత్రం అనుమతులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించడం లేదు. 

 

అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు దేవాలయాలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే తిరుపతి ఆలయం సహా పలు దేవాలయాలు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలను తిరిగి తెరవడానికి గానూ కేంద్రాన్ని అనుమతి కోరింది. మరి దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: