ఎప్పటికప్పుడు ఏదోక వార్తల్లో ఉంటూనే ఉన్నాడు... పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది. అతను ఏదోక  కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటాడు. తాజాగా అతను మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా మీరు రాజకీయాల్లో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నకు గానూ అతను స్పందించాడు. తాను రాజకీయాల్లో చేరాలనుకుంటే.. ఎప్పుడో చేరేవాడినని చెప్పుకొచ్చాడు.  

 

చాలా పార్టీలు నాకు ఆఫర్ ఇచ్చాయన్నాడు. అవును, నేను ఓ రాజకీయనాయకుడు చేసే సమాజసేవ చేస్తున్నానని తన సేవా కార్యక్రమాల గురించి వివరించాడు. అందుకు నాకు రాజకీయ పార్టీల నుంచి ప్రజల నుంచి ఎంతో మద్దతు లభించిందన్నాడు.. కానీ, నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశలేదని... ప్రజలకు సేవ చేయడమే నాకు ముఖ్యమని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: