చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఇప్పుడు సంచలనంగా మారింది. చైనా అనవసరంగా భారత్ ని ఇప్పుడు ఈ విషయంలో రెచ్చగొడుతుంది. యుద్దానికి సిద్దంగా ఉండాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు ఆదేశ అధ్యక్షుడు. దీనిపై ఆర్మీ మాజీ చీఫ్ కేంద్ర మంత్రి వీకే సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎల్‌ఐసిని (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) నిర్దిష్ట పద్ధతిలో ఎవరూ గుర్తించలేదని, అందువల్లే చైనా, భారత్ మధ్య దాని గురించి భిన్నమైన వాదనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

 

కరోనాను చైనాయే సృష్టించిందని లోకం కోడై కూస్తోందని ఆయన ఆరోపించారు. ఆ ఆరోపణల నుంచి దృష్టి మరల్చడానికే సరిహద్దు వివాదాన్ని చైనా తెరపైకి తెచ్చిందని ఆయన మండిపడ్డారు. చైనా నుంచి చాలా కంపెనీలు మూట ముళ్లె సర్దుకొని వెళ్లిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రపంచ దృష్టి మరల్చడానికి చైనా ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: