ప్రగతి భవన్ లో తెలంగాణా సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ పరిస్థితులు ఇచ్చే మినహాయింపులు లాక్ డౌన్ ని కొనసాగించడం సహా పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ పై ఆయన నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

 

ఈ తరుణంలో ప్రగతి భవన్ ముందు ఆందోళనకర వాతావరణం చోటు చేసుకుంది. ప్రగతిభవన్‌ను ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ముట్టడించి... డిగ్రీ సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డికి విద్యార్థులు తమ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో తమ కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: