లాక్ డౌన్ పై తెలంగాణా సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం జరుగుతుంది. ప్రగతి భవన్ లో అధికారులు మంత్రులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలి అని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోవడం తో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 

ఆర్ధిక శాఖకు ఆదేశాలు జారీ చేసారు కేసీఆర్. 50 శాతం జీతాల్లో కోత విధిస్తామని ప్రకటించింది. ఇక ఈ సమావేశంలో ఆర్టీసి బస్సులపై ఆయన కూడా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చత్తీస్ఘడ్ నుంచి బస్సులను అనుమతించే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అక్కడ కేసులు చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: