భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల సరిహద్దుల్లో చైనా సైన్యాన్ని మొహరించి యుద్దానికి సిద్దమవుతుంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా యుద్దానికి సిద్దంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. దీనితో సరిహద్దుల్లో  యుద్ధం వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

ఇక దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్ చైనా మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి తాను సిద్దంగా ఉన్నా అని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసారు. తాను మధ్యవర్తిత్వం చేస్తా అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని భారత్ చైనాకు తాము చెప్పామని ఆయన తన  ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా గతంలో పాకిస్తాన్ విషయ౦లో జోక్య౦ చేసుకోవడానికి ట్రంప్ ముందుకు రాగా మాకు అవసరం లేదని భారత్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: