దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ మరింతగా పెరిగిపోతున్నాయి. అయితే కరోనా కేసులు మొదల కేరళాలో మొదలైయ్యాయి.  కేరళాలో విదేశీయుల నుంచి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని అప్పట్లో వైద్యులు తెలిపారు.  ఆ తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విస్తరించాయి. విచిత్రం ఏంటంటే ఆ మద్య కేరళాలో జీరో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.  ఈ మద్య కేసులు మల్లీ పెరుగుతున్నాయి.  కొత్తగా బుధవారం ఒక్కరోజే కేరళలో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు.

 

అయితే.. వీటిలో 9 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారని, 16 మంది మహారాష్ట్ర నుంచి, 5 మంది తమిళనాడు నుంచి, ముగ్గురు ఢిల్లీ నుంచి, ఏపీ, యూపీ, కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1004కు చేరుకోగా..వీటిలో 445 యాక్టివ్‌ కేసులున్నాయని సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు. మంగళవారం నాటికి వివిధ దేశాల్లో ఉన్న 173 మంది కేరళవాసులు కరోనాతో చనిపోయారని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: